జేసీ బ్రదర్స్‌కు సెక్యూరిటీ.. జగన్ సర్కార్ ఆదేశాలు

by srinivas |   ( Updated:2021-06-10 00:19:30.0  )
JC Diwakar Reddy & Prabhakar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ గురించి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తెలియని వారు ఎవరూ ఉండరని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉంటూ ఉంటారు జేసీ బ్రదర్స్. నిర్మోహమాటంగా కుండబద్ధలు కొట్టినట్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. అందుకే రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ రూటే సపరేటు అని అందరూ అంటూ ఉంటారు. తప్పు చేస్తే సొంత పార్టీనే కూడా విమర్శించడానికి వెనుకాడరు.

గత ఎన్నికలకు ముందు జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా ఉండగా.. ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో వీరిద్దరూ రాజకీయాల నుంచి తప్పుకుని తమ కుమారులను బరిలోకి దింపగా ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిన జేసీ బ్రదర్స్.. తమకు గన్ మెన్లను కేటాయించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో తాజాగా జేసీ బ్రదర్స్‌కు వన్ ప్లస్ వన్ గన్‌మెన్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 24న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి, జేసీ బ్రదర్స్‌కు మధ్య ఘర్షణలు చోటుచేసకున్నాయి. దీంతో కేతిరెడ్డి నుంచి తమకు ప్రాణహని ఉందని, గన్ మెన్లను కేటాయించాలని జేసీ బ్రదర్స్ దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Next Story