ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల

by srinivas |
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ఈసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉన్నత విద్యాశాఖ కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. 96.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. మొత్తం 37,160 మంది దరఖాస్తు చేసుకుంటే 31,981 మంది హాజరయ్యారని వారిలో 30,654 మంది క్వాలిఫై అయినట్లు మంత్రి పేర్కొన్నారు. క్వాలిఫై అయినవారిలో 25,160 మంది పురుషులు, 6,731 మంది మహిళలు ఉన్నారు. ర్యాంక్‌ కార్డులను ఈనెల 8 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.

Next Story