ఆ లెటర్ నేను రాయలేదు

by srinivas |
ఆ లెటర్ నేను రాయలేదు
X

తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాకు తాను ఎలాంటి లేఖలు రాయలేదని ఏపీ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, పలువురు అధికారులను బదిలీ చేసిన విషయంలో తనకు,తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సెక్యూరిటీ కోరతూ కేంద్ర హోంశాఖకు రమేష్ కుమార్ రాసినట్టు ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అది కాస్త ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ ఘటనలో వైసీపీ నేతలే ఈసీని బెదిరింపులకు గురిచేశారని ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఆరోపించారు.

Tags: ec ramesh kumar, ap, central govt home secretary ajay, letter was not mine

Advertisement

Next Story