కరోనా విన్నర్ ఐపీఎస్‌లకు డీజీపీ స్వాగతం

by srinivas |
కరోనా విన్నర్ ఐపీఎస్‌లకు డీజీపీ స్వాగతం
X

దిశ, ఏపీ బ్యూరో: దిశా స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్‌, డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ దంపతులకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సాదరంగా స్వాగతం పలికారు. పాటిల్ దంపతులు ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనాను జయంచి విధుల్లో చేరారు. ఈ నేపథ్యలో డీజీపీ మాట్లడుతూ, కోవిడ్‌ను జయించిన పోలీసు అధికారులు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని సూచించారు. కరోనా బాధితుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరడం హర్షనీయమని ఆయన పేర్కొన్నారు. డీజీపీ ఇచ్చిన నైతిక బలంతోనే కరోనాను జయించామని పాటిల్ దంపతులు పేర్కొన్నారు.

Advertisement

Next Story