- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షర్మిల పార్టీ వెనక జగన్.. ఇదే ప్రూఫ్!
దిశ, వెబ్‌డెస్క్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇవ్వడంతో సరికొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. షర్మిల పార్టీ వెనుక బీజేపీ ఉందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఇదంతా కేసీఆరే ప్లాన్ చేశారన్నట్టుగా అనుమానిస్తున్నారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ తతంగాన్నంతా ఆమె సోదరుడు, ఏపీ సీఎం జగనే వెనకుండి నడిపిస్తున్నారన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఏపీలో తన సొంత అన్నే సీఎంగా ఉండగా, షర్మిల ఇక్కడ ఎందుకు పార్టీ పెట్టాలనుకున్నారు ? కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం ప్రకారం వైఎస్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయన్నది నిజమేనా? అసలు షర్మిల.. హైదరాబాద్, తాడేపల్లిలో కాకుండా బెంగళూరులో ఎందుకు ఉంటున్నారు? ఇంత సడన్‌గా పార్టీ స్థాపించే దిశగా ఎందుకు అడుగులేస్తున్నారు ? వాచ్ దిస్ స్టోరీ..
2009లో ‘రచ్చబండ’ కార్యక్రమానికి హెలికాప్టర్‌లో వెళ్తూ ప్రమాదవశాత్తు పావురాలగుట్టలో వైఎస్ అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే వైఎస్ మరణవార్త విని అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు వందల సంఖ్యలో చనిపోయారని, వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపడతానని జగన్ చెబితే కాంగ్రెస్ అధినేతి సోనియా గాంధీ అంగీకరించలేదన్నది బహిరంగ రహస్యం. అందుకే సోనియాతో విభేదించిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. బయటకు వచ్చి సొంతంగా వైఎస్ఆర్‌సీపీని స్థాపించారు. గౌరవాధ్యక్షురాలిగా ఆయన తల్లి విజయమ్మ ఉన్నారు. ఇక జగన్ ఓదార్పుయాత్ర చేస్తున్న సమయంలోనే అక్రమాస్తుల కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన విషయం విదితమే. అప్పుడు సోదరి షర్మిల ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ ఉమ్మడిరాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించి.. జగన్ జైలు నుంచి విడుదలయ్యేవరకు పార్టీని కాపాడారు. ఇక్కడివరకు వైసీపీతో షర్మిలకు ఉన్న అనుబంధం.
కానీ.. 2019లో ఏపీలో సంచలన విజయం సాధించి అధికారం చేపట్టిన వైసీపీ అధినేత జగన్.. తన సోదరిని రాజకీయంగా ఎంకరేజ్ చేయడం లేదన్నది ఎప్పట్నుంచో వినిపిస్తోన్న మాట. కానీ అది ఫ్యామిలీ మ్యాటర్ అని అంతా లైట్ తీసుకున్నారు. బట్.. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం చేయడం, ఆమె ఇవన్నీ ఖండించకుండా ఇవాళ డైరెక్ట్‌గా తెలంగాణలోని వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం సంచలనంగా మారింది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తా, ఇక్కడ ఎందుకు రాజన్న రాజ్యం రాకూడదు, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకే సమావేశాలు ఏర్పాటు చేశానని చెప్పడంతో.. ఇక షర్మిల తెలంగాణ రాజకీయాల్లో పాతుకుపోబోతున్నారన్న అంశం బడా లీడర్ల నుంచి గ్రామస్థాయి నేతల వరకు చొచ్చుకెళ్లింది.
అయితే ఈ అంశంపై స్పందించిన పలువురు రాజకీయ నేతలు.. ఇదంతా బీజేపీయే ఆడిస్తోందని అభిప్రాయపడుతుండగా, కాదు కాదు కేసీఆరే వ్యూహాత్మకంగా జగన్‌తో ఉన్న దోస్తీని ఇక్కడ కొనసాగిస్తూ పార్టీ పెట్టించారని చెబుతున్నారు. కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే.. షర్మిల, తెలంగాణలోని వైఎస్ అభిమానులతో అయితేనే ఈజీగా అవుతుందని, అప్పటివరకు బీజేపీకి గ్రౌండ్ లెవల్‌లో కార్యకర్తలు పెరిగిపోతారని, తెలంగాణలో బలపడేందుకు బీజేపీ వేసిన కొత్తరకమైన ఎత్తుగడను ఈ రూపంలో అమలు చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదో వాదనైతే టీఆర్ఎస్‌కు బీజేపీ పోటీగా వస్తుందని భావించిన కేసీఆరే.. ‘రెడ్డి’సామాజిక వర్గాన్ని బీజేపీలో చేరకుండా షర్మిల పార్టీవైపునకు మళ్లించేందుకు తన పాశుపశాస్త్రాన్ని బయటకు తీసి బీజేపీ, కాంగ్రెస్‌ను కోలుకోని విధంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్న అంశాలు వినపడుతున్నాయి.
అటు రాజకీయంగా, ఇటు సాధారణ జనాల్లో ఈ విధమైన చర్చ జరుగుతుంటే కొందరు రాజకీయ పండితుల విశ్లేషణలు మాత్రం.. షర్మిల పార్టీ పెట్టడం వెనెక ఆమె సోదరుడు జగన్మోహన్‌రెడ్డే ఉన్నారని చెబుతుండటం గమనార్హం. ఏపీలో సీఎంగా ఉన్న జగన్.. తన చెల్లితో పార్టీ పెట్టించి సీట్లు సాధిస్తే.. అప్పుడు కేంద్రంలో కీలకంగా మారుతారని, ఒకవేళ కేసీఆర్ లేదా ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే షర్మిల పార్టీకి చెందిన సీట్లు కింగ్ మేకర్ అవుతాయని, వీటన్నింటిపై జగన్ టీమ్ లోతైన విశ్లేషణ చేసే.. తెలంగాణలో రంగంలోకి దింపారన్న విస్పష్టమైన అభిప్రాయాలు వస్తున్నాయి. ఏపీలో సీఎంగా ఉంటూ తెలంగాణలో షర్మిల కింగ్ మేకర్ అయితే, జాతీయ రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీకి ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. కానీ వైఎస్ అభిమానులు మాత్రం భారతి, షర్మిల మధ్య పొరపచ్చాలు రావడంతోనే ఆమె బయటకు వచ్చారని, వారిద్దరి మధ్యలోకి వెళ్లలేక జగన్ సైలెంట్‌గా ఉండటంతోనే షర్మిల పార్టీ పెడుతుందన్న ప్రచారమూ జరుగుతోంది.