Y. S. Jaganmohan Reddy: ప్రాణం విలువ తెలుసు.. అందుకే ఆరోగ్య శ్రీకి ప్రాధాన్యం ఇచ్చాం : జగన్

by Anukaran |   ( Updated:2021-05-20 03:52:04.0  )
Y. S. Jaganmohan Reddy: ప్రాణం విలువ తెలుసు.. అందుకే ఆరోగ్య శ్రీకి ప్రాధాన్యం ఇచ్చాం : జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ అంచనా.. రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. బడ్జెట్‌పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ముందుగా ఇటీవల కరోనా మహమ్మారి సోకి బలైన వారికి అసెంబ్లీలో రెండు నిముషాలు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి మాట్లాడుతూ. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశామని అన్నారు. అలాగే వెనుకబడిన కులాలకు ఈ బడ్జెట్‌లో 32 శాతం అధిక కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీలో చాలా మార్పులు తీసుకొచ్చామని, ఆరోగ్యశ్రీని పేదలందరికీ అందేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 2,400 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఆరోగ్యశ్రీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 1,180 అంబులెన్సులను ప్రారంభించామని, ఆపద ఉందని ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే అంబులెన్సులు ఘటనా స్థలికి వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచానికి కొవిడ్ పెను సవాల్‌గా మారిందని అన్నారు. కొవిడ్ టెస్టులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో 150కి పైగా ల్యాబ్‌లు ఉన్నాయని, గతంలో పూణే నుంచి ఆలస్యంగా వచ్చేవని గుర్తుచేశారు. వైద్యరంగం రూపురేఖలు మార్చేలా అడుగులు వేస్తున్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి పార్లమెంట్ కేంద్రంలో ఒక మెడికల్ కాలేజీ, ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed