- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోగి రమేష్‌కు నిరాశే… ధర్మాన కృష్ణదాస్ రెవెన్యూ?
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణ రేపు జరుగనుంది. దీంతో వైఎస్ఆర్సీపీ ఆశావహుల్లో ఆశలు మిణుకు మిణుకు మంటున్నాయి. అధినేత కనికరిస్తారన్న భావన కొందరిలో నెలకొంది. అయితే ప్రస్తుతానికి రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాతో ఖాళీ అయిన మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు.
ఈ స్థానాల్లో వివాదరహితులుగా పేరొందిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుతో భర్తీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. వీరిద్దరితో బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వాస్తవానికి జోగి రమేశ్, పొన్నాడ సతీశ్‌లకు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు భావించినప్పటికీ సామాజికవర్గాల కూర్పు నేపథ్యంలో వేణుగోపాలకృష్ణ, అప్పలరాజులవైపే జగన్ మొగ్గుచూపారు.
ఇంకోవైపు.. రోడ్లు భవనాల మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని.. ఇంతవరకు ఈ హోదాలో బోస్ చూసిన రెవెన్యూ శాఖను కృష్ణదాస్ కి అప్పగిస్తారని తెలుస్తోంది. కొత్త మంత్రులు వేణుకు ఆర్‌అండ్‌బీ, అప్పలరాజుకు మత్స్యశాఖను అప్పగిస్తారని సమాచారం. ఇంకో వైపు గతంలో సీఎం పేర్కొన్నట్లు… పనితీరు ఆధారంగా శాఖల మార్పిడి ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు సీఎం నిర్ణయం తీసుకున్నారని, దీంతో మంత్రి వర్గంలో భారీ ఎత్తున మార్పులు చోటుచేసుకోనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రుల శాఖలు మారతాయని వైఎస్ఆర్సీపీ అంతర్గత సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా కడప జిల్లాకు చెందిన జకియా ఖానుం, అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు పేర్లను సీఎం జగన్ గవర్నర్‌కు పంపిన సంగతి తెలిసిందే.