బీజేపీ నేతల ఆరోపణలు దారుణం

by srinivas |
బీజేపీ నేతల ఆరోపణలు దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మఒడి పథకంపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై ఏపీ బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు కౌంటర్ ఇచ్చారు. అమ్మఒడి పథకానికి దేవాదాయశాఖ నిధులు మళ్లించారని బీజేపీ నేతలు కన్నా, విష్ణువర్ధన్‌రెడ్డిదలు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లడవద్దని హితవు పలికారు. ఈ పథకానికి ఆలయాల హుండీలు, భక్తుల కానుకల నుంచి నిధుదలు మళ్లించారనడం దారుణమని మల్లాది విష్ణు అన్నారు. బడ్జెట్ నుంచే అమ్మఒడి పథకానికి నేరుగా నిధులను కేటాయించారని చెప్పారు. పూర్తి వివరాలను తెలుసుకుని మాట్లాడాలని… లేకపోతే అభాసుపాలవుతారని మల్లాది విష్ణు హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed