రేపు చలో రామతీర్థం..

by srinivas |   ( Updated:2021-01-03 10:58:52.0  )
రేపు చలో రామతీర్థం..
X

దిశ, ఏపీబ్యూరో : రామతీర్థంలో మూల విరాట్​శ్రీరాముని శిరచ్ఛేదనాన్ని నిరసిస్తూ మంగళవారం బీజేపీ, జనసేన పార్టీలు ‘చలో రామతీర్థం’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రామతీర్థం ఘటనను టీడీపీ, వైసీపీ రాజకీయం చేయాలని‌ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దోషులను అరెస్ట్ చెయ్యాల్సిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయటం పోలీసు దమనకాండకు నిదర్శనమన్నారు.

మహిళలు అనిచూడకుండా అత్యంత నీచంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లటాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల‌పై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వెలిబుచ్చారు. ఆలయాల భద్రత ప్రభుత్వ బాధ్యతన్నారు. అత్యంత పురాతన, పవిత్రమైన ఆలయంలోనే ఇలాజరగడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్టగా వీర్రాజు పేర్కొన్నారు.

Advertisement

Next Story