- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదు రోజుల్లో 18 బిల్లులకు ఆమోదం
దిశ, ఏపీ బ్యూరో: శాసనసభ శీతాకాల సమావేశాలు ఐదు రోజులపాటు నడిచాయి. మొత్తం 39 గంటల 4 నిమిషాలపాటు సభ జరిగింది. 18 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. మరో రెండు బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రెండు తీర్మానాలను సభలో ప్రవేశపెట్టగా ఏడు అంశాలపై స్వల్ప చర్చ జరిగింది.
ఆమోదించిన బిల్లుల్లో ఏపీ ఫిష్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) , ఆక్వాకల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) సవరణ, ఫిషరీస్ యూనివర్శిటీ , ఆన్లైన్ గేమింగ్ సవరణ, మున్సిపల్ లా రెండో సవరణ, అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్) సవరణ, స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రెండో సవరణ (మనీ బిల్లు), వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మూడో సవరణ (మనీ బిల్లు), ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్, ట్రేడ్స్, కాలింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్స్ సవరణ (మనీ బిల్లు), యానిమల్ ఫీడ్ (రెగ్యులేషన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చర్, క్వాలిటీ కంట్రోల్, సేల్ అండ్ డిస్ట్రిబూషన్) , ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ సవరణ (మనీ బిల్లు), స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (మనీ బిల్లు) అగ్రికల్చరల్ ల్యాండ్ (కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్) సవరణ (మనీ బిల్లు), ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ(మనీ బిల్లు), దిశ (స్పెషల్ కోర్ట్స్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్) , ల్యాండ్ టైటిలింగ్, ఆంధ్రప్రదేశ్ అప్రాప్రియేషన్ (మనీ బిల్లు) ఉన్నాయి.
స్థానిక ఎన్నికల నిర్వహించలేమని తీర్మానం
కరోనా కారణంగా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని అసెంబ్లీలో తీర్మానించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా సభ ఆమోదించింది.. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్న తరుణంలో ప్రజల భద్రతే ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ నిర్ణయం తీసుకుందన్నారు. పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడే ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.