తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బిగ్ షాక్.. డిపాజిట్ గల్లంతు..!

by srinivas |   ( Updated:2021-05-02 04:03:25.0  )
BJP
X

దిశ, వె‌బ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అటు ఏపీలోని తిరుపతి పార్లమెంటు స్థానం, ఇటు తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో రెండు చోట్ల బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. సాగర్‌ ఉపఎన్నికను తెలంగాణ బీజేపీ నాయకులు లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో దుబ్బాక ఉపఎన్నిక మీద బీజేపీ కనబరిచిన దూకుడు ఇప్పుడు పెద్దగా కనిపించలేదు.

అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం కూడా ఎలాగు ఓటమి తప్పదని కమలనాధులు ముందే ఊహించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్లే సాగర్ పై తెలంగాణ బీజేపీ అంతగా శ్రద్ధ పెట్టలేదని సమాచారం. అయితే, తిరుపతి ఉపఎన్నికను మాత్రం ఏపీ బీజేపీ, జనసేన పార్టీలు సీరియస్‌గా తీసుకున్నా వైసీపీ చరిష్మా ముందు కమలం పార్టీ తేలిపోయింది. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏమాత్రం పోటీని ఇవ్వకపోగా, కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోకపోవడం బీజేపీకి పెద్ద దెబ్బగా పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలాఉండగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కాంగ్రెస్ అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోలయినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story