- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భవిష్యవాణి.. త్వరలో కరోనాను మించిన రోగాలు..!
దిశ, చార్మినార్: పాతబస్తీ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఘట్టంలో సామూహిక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం వద్ద ఆలయ కమిటీ అధ్యక్షుడు జనగామ మధుసూదన్ గౌడ్ ఆధ్వరంలో రంగం(భవిష్యవాణి) కార్యక్రమం జరిగింది. ముఖానికి పసుపు పూసుకుని అమ్మవారు ఆవహించిన అనంతరం పచ్చి కుండపై నిలపడ్డ మాతంగి కే అనురాధ భవిష్యవాణి వినిపించింది. ‘నా గుడిని ఎంతవరకు చేసుకోవాలో అంత వరకు కట్టించుకున్నా.. ఇంత బాధలో ఉన్నప్పటికీ నాకు పూజలు చేసి నన్ను సంతోషపరిచారు. మిమ్మల్ని నేను చల్లంగా చూసుకునే దాన్నే .. కానీ చిన్న చిన్న తప్పులు.. ఆటంకాల వల్ల పెద్ద పెద్ద ముప్పులు తెచ్చుకుంటున్నారు. కానీ దీని కన్నా పెద్ద రోగాలు వచ్చేది ఉంది. ఎవరిని ఎంతవరకు కాపాడాలో అంతవరకు కాపాడుతా.. కుండ నిండాక కుండలోంచి నీళ్లు జారిపడక తప్పదు. ఎలాంటి అంటు రోగాలు వచ్చినా నా గుడికి వచ్చి బండారుని తీసుకుని నుదుట పెట్టుకోండి. భోజనం సేవించండి. ఎంతటి రోగాలనైనా పారద్రోలుతా.. నన్ను సాగనంపకుండా మీ ఇళ్లలో పెట్టుకుని.. పసుపు ముద్దలు చేసి వాయిదాలు ఇచ్చుకుని, ఐదువారాలు సాక పెట్టి, నిండార్ల హారతి ఇచ్చి, మారుబోనం మంచిగా చేసుకుంటే ఎవ్వరికి ఏమీ కాకుండా చూస్తా’ అంటూ మాతంగి కే అనురాధ అభయమిచ్చింది.