- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వర్చువల్ ల్యాండ్‌కు 4.3M డాలర్ల పెట్టుబడి.. మెటావర్స్‌లో నయా రికార్డ్!
దిశ, ఫీచర్స్: రియల్ ఎస్టేట్ తెలుసు కానీ ‘డిజిటల్ ఎస్టేట్’ తెలుసా? లేదు కదా. రాబోయే రోజుల్లో ప్రపంచమంతా ‘వర్చువల్ వరల్డ్’గా మారిపోనుంది. వర్చువల్/అగ్‍మెంటెడ్ రియాల్టీ ద్వారా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ డిజిటల్ అవతారాల్లో ప్రత్యక్షం కావడం, మన అభిరుచికి తగ్గట్టుగా వర్చువల్ ప్రపంచాలు సృష్టించుకుని వాటిలో నివసించడం ‘మెటావర్స్’తో సాధ్యం కానుంది. ఇదే విధంగా భూగ్రహాన్ని డిజిటల్ గ్రిడ్ లేయర్స్, టైల్స్‌గా విభజిస్తారు. ఈ టైల్స్ విలువ యూఎస్‌లో ఒక విధంగా ఉంటే.. ఆస్ట్రేలియా, ఇండియాలో మరో రకంగా ఉండనున్నాయి. ఇందులో మనకు కావాల్సిన ల్యాండ్స్‌ను, బిల్డింగ్స్‌ను నిర్మించొచ్చు. డిజిటల్ భూభాగంలో కొనవచ్చు. వాటిని డెవలప్ చేసి అమ్ముకోవచ్చు. ఈ క్రమంలోనే డిజిటల్ ఎస్టేట్‌లో రికార్డ్స్ బ్రేక్ అవుతూనే ఉన్నాయి. ఈ మేరకు ‘ది శాండ్‌బాక్స్’లో వర్చువల్ రియల్ ఎస్టేట్ ప్లాట్ $4.3 మిలియన్లకు తాజాగా అమ్ముడుపోగా, ఇదో రికార్డ్‌గా నిలిచింది.
NonFungible.com డేటా ప్రకారం ఈ విక్రయం మెటావర్స్ చరిత్రలోనే అతిపెద్దది కాగా ఈ వర్చువల్ ల్యాండ్‌ను వీడియో గేమ్ కంపెనీ అటారీ నుంచి ఓ డెవలపర్ కొనుగోలు చేశాడు. దీనికి ‘రిపబ్లిక్ రీమ్’గా పేరు పెట్టనున్నాడు. Metaverse Group, Tokens.com ద్వారా ఈ విక్రయం జరగగా.. వర్చువల్ ప్లాట్ డిసెంట్రాలాండ్‌లో ఉంది. ఈ డిజిటల్ భూమిలో 6,090 వర్చువల్ చదరపు అడుగుల పరిమాణంలో ఒక్కొక్కటి 52.5 చదరపు అడుగులో 116 చిన్న చిన్న ప్లాట్లను తయారు చేశారు. ఇక శాండ్‌బాక్స్ అనేది Ethereum మెటావర్స్. SAND అని పిలిచే, దాని స్థానిక కరెన్సీలో డీలింగ్ జరుగుతుంది.
డిసెంట్రాల్యాండ్‌లో 3డీ వర్చువల్ రియాలిటీ ప్లాట్‌ఫామ్ కాగా ఇది మ్యాప్‌బాక్స్ టెక్నాలజీతో సృష్టించిన వర్చువల్ ల్యాండ్. డిసెంట్రాల్యాండ్‌లోని భూమి, ఇతర వస్తువులను నాన్-ఫంజిబుల్ టోకెన్‌ల (NFT) రూపంలో విక్రయిస్తారు. ఇది ఒక రకమైన క్రిప్టోకరెన్సీ తరహాలో డిజిటల్ మనీగా చెప్పుకోవచ్చు. మెటావర్స్ ప్రారంభం కావడంతో, సంపన్నులు ఇప్పటికే వర్చువల్ ల్యాండ్‌లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ ప్లాట్లు ఏ ప్రయోజనం కోసం ఉపయోగపడతాయనే విషయంలో ఇంకా పూర్తి సమాచారం తెలియదు కానీ ఇప్పటికీ వర్చువల్ ల్యాండ్‌పై కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు.