దళిత బంధుకు మరో రూ. 250 కోట్లు విడుదల

by Shyam |
దళిత బంధుకు మరో రూ. 250 కోట్లు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘దళిత బంధు’ పథకం కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ రూ. 250 కోట్లను ఎస్సీ అభివృద్ధి శాఖకు సోమవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని నాలుగు దిక్కులా నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున వాటి అవసరాల నిమిత్తం ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలానికి మాత్రం రూ. 100 కోట్లను విడుదల చేసి మిగిలిన మూడు మండలాలకు తలా రూ. 50 కోట్ల చొప్పున విడుదల చేశారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట-కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నిజాంసాగర్ మండలాలకు రూ. 50 కోట్ల చొప్పున ‘దళిత బంధు’ పథకం కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నిధులను విడుదల చేసింది.

Advertisement

Next Story