యాదాద్రి జిల్లాలో మరో కరోనా కేసు

by Shyam |   ( Updated:2020-05-17 11:28:01.0  )
యాదాద్రి జిల్లాలో మరో కరోనా కేసు
X

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురులో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ మేరకు మండల వైద్యాధికారులు ధ్రువీకరించారు. గ్రామంలో ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు జీవనోపాధి కోసం వలస వెళ్లారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వారంతా ఈ నెల 12న స్వగ్రామానికి వచ్చారు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది వారికి వైద్య పరీక్షలు చేశారు. అందులో ఒకరికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అతడిని హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఐదుగురు సభ్యులను హోం క్వారంటైన్ చేశారు. అయితే హైదరాబాద్ పంపిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ కుటుంబ సభ్యుల మొత్తానికి మరోసారి వైద్య పరీక్షలు చేయడంతో మరొక్కరికి అనుమానిత లక్షణాలు కన్పించాయి. దీంతో అతడిని సైతం కింగ్ కోఠి హాస్పిటల్‌కు తరలించారు.

Advertisement

Next Story