- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృద్ధాప్య పెన్షన్ల దరఖాస్తుకు మరో అవకాశం
దిశ, తెలంగాణ బ్యూరో : వృద్ధాప్య పెన్షన్లకు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. ఆ వయోపరిమితిని అనుసరించి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా దరఖాస్తులు చేసుకొనేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఆగస్టు 31 నాటికి కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అర్హులందరికీ అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఈ నెల 11 నుండి 30లోగా దరఖాస్తుకు మరో అవకాశం కల్పించింది. ఈ సేవా లేదా మీ సేవల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను స్వీకరించాలని, తక్షణమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలను ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అర్హులైన వారు నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈనెల 30 లోగా దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. జీఓ 75 ప్రకారం పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఓటర్ కార్డు తదితర పత్రాలను దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. కాగా, ఈ దరఖాస్తులకు ఈ సేవ, మీ సేవల్లో సేవల రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుములు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.
57ఏళ్లు పైబడిన వారంతా దరఖాస్తు చేసుకోవాలి
రాష్ట్రంలో 57 ఏండ్లు, ఆపై వయస్సు కలిగిన వాళ్లంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ-సేవ, మీసేవలో దరఖాస్తు చేసుకుంటే డబ్బులు ఇవ్వొద్దు. దరఖాస్తుకు ఇంత అని ప్రభుత్వమే చెల్లిస్తోంది. పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఓటర్ కార్డును దరఖాస్తుతో జతచేయాలి. కలెక్టర్లు ఈ నెల 30లోగా దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి అర్హుల జాబితా అందజేయాలి. వృద్ధులకు రూ.2016లు, దివ్యాంగులకు రూ.3016 అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ.
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు