వరంగల్ అర్బన్‌ జిల్లాలో బాలుడికి కరోనా

by Shyam |

దిశ, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. వేలేరు మండలం ఎర్రబెల్లి తండాకు చెందిన 13 ఏళ్ల బాలుడికి కొవిడ్-19 నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి స్పష్టం చేశారు. ఆ బాలుడిని చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఎర్రబెల్లి తండాను కంటైన్‌మెంట్ ప్రాంతంగా గుర్తించినట్లు వెల్లడించారు. ఇటీవల అర్బన్ జిల్లాలోని పూరిగుట్టకు చెందిన బాలికకు కరోనా పాజిటివ్ రాగా, సదరు యువకుడు ప్రాథమిక కాంటాక్ట్ లో ఉన్నట్లు ఆమె వివరణ ఇచ్చారు.

Tags: Corona positive, 13 year old boy, Warangal Urban

Advertisement

Next Story