యూపీలో మరో దారుణం… కొవాగ్జిన్ కు బదులు కోవిషిల్డ్.. !!

by vinod kumar |   ( Updated:2021-04-15 04:21:39.0  )
యూపీలో మరో దారుణం… కొవాగ్జిన్ కు బదులు కోవిషిల్డ్.. !!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవలే యూపీలోని ఓ ఆసుపత్రిలో కరోనా వాక్సిన్ కోసం వచ్చిన మహిళలకు రేబిస్ వాక్సిన్ వేసిన ఉద్ధాంతం మరువక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. మహరాజ్ గంజ్ జిల్లా ముఖ్య అభివృద్ధి అధికారి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న ఉమేష్ కు వైద్య సిబ్బంది మొదట కొవాగ్జిన్ ఇచ్చి రెండవ వాక్సిన్ కోవిషిల్డ్ ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు స్పందించి ఉమేష్ తో పాటు ఎవరికి కొవాగ్జిన్ ఇచ్చారో వారందరికీ కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలని మరోసారి గుర్తు చేశారు. ఉమేష్ కు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైనా వైద్య సిబ్బంది వాక్సిన్ వేసే విషయంలో నిర్లక్ష్యం మాని విధులు శ్రద్ధతో నిర్వహించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed