యాక్సిడెంట్ మృతులకు మరో యాక్సిడెంట్ (వీడియో)

by Shyam |   ( Updated:2023-05-19 08:24:10.0  )
యాక్సిడెంట్ మృతులకు మరో యాక్సిడెంట్ (వీడియో)
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో కరీంనగర్ -హైదరాబాద్ రాజీవ్ రహదారి పై సిద్దిపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న సిద్దిపేట టూ టౌన్ సీఐ పరశురామ్ గౌడ్, ఎస్ఐలు సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకొని మృత దేహాలను మార్చురీకి తరలిస్తుండగా.. అదే సమయంలో కరీంనగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం వచ్చి ఢీ కొట్టింది.

దీంతో సీఐతో పాటు కానిస్టేబుల్స్, 10 మంది స్థానికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ఈ ఘటనలో ఎస్ఐ కనకయ్య గౌడ్ క్షేమంగా బయటపడగా.. పలువురు గాయపడ్డారు. మరో ఇద్దరు మృతి చెందారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి సీపి, ఏసీపీ చేరుకుని ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ వీడియో కింద ఉంది చూడవచ్చు.

Advertisement

Next Story