జనగామలో మరో 8 కరోనా కేసులు

by vinod kumar |
జనగామలో మరో 8 కరోనా కేసులు
X

దిశ, జనగామ: జనగామలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 8 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మహేందర్ వెల్లడించారు. కాగా, జిల్లా కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణంలో మంగళవారం ఒక్క పాజిటివ్ నమోదవగా.. ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా శుక్రవారం నాటికి ఆ సంఖ్య 16కు చేరుకున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. రేపటి నుంచి ‌ఫెర్టిలైజర్ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేసిన రైతులను గుర్తించి ర్యాండమ్‌గా వైద్య పరీక్షలు నిర్వహించి వైరస్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story