- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ బాక్స్ తీసుకెళ్తూ ANM మృతి.. కంటతడి పెట్టిన వైద్య బృదం
దిశ, మక్తల్ : మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాక్సిన్ బాక్స్ తీసుకొని స్కూటీపై వెళ్తున్న ఏఎన్ఎంను లారీ ఢీ కొన్న ఘటన బుధవారం ఉదయం జిల్లాలోని మక్తల్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏఎన్ఎం వర లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే.. వరలక్ష్మీ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లోని మాగనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి వ్యాక్సిన్ తీసుకొని కొల్పూర్ గ్రామానికి వెళ్తుండగా వడ్డేవాట్ గేటు మలుపు వద్ద స్కూటీని రాయిచూర్ నుంచి వస్తున్న లారీ స్కూటీని వేగంగా ఢీ కొనడంతో లారీ చక్రాలు వరలక్ష్మీ పై నుండి వెళ్లాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మక్తల్ ఎస్‌ఐ ఎదిరింటి రాములు, దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు. సక్రమంగా ఏఎన్ఎం విధులను నిర్వర్తించే వరలక్ష్మి చనిపోవడం బాధాకరమైన విషయమని పి ఎస్ డాక్టర్ శ్రీమంత్తో, సిబ్బంది కంటతడి పెట్టారు.