- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృద్ధ నటుడిని పెళ్లి చేసుకున్న యువతి.. కారణమిదే!
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ చాలా సార్లు వార్తల్లో నిలిచాడు. ఈ 55 ఏళ్ల ఫిట్ యాక్టర్ బీచ్‌లో నగ్నంగా పరుగెత్తిన ఫొటోలు షేర్ చేసి హెడ్ లైన్స్ టచ్ చేయడంతో పాటు తన కన్నా దాదాపు 30 ఏళ్ల చిన్న అమ్మాయి(అంకిత కొన్వర్)ని పెళ్లి చేసుకుని హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. కాగా ఇదే విషయంపై అంకితను ప్రశ్నించారు నెటిజన్లు. తాజాగా ఇన్‌స్టాఫ్యామ్‌తో చాట్ చేసిన తనకు ‘వృద్ధుడిని పెళ్లి చేసుకోకూడదు అనే స్టిరియోటైప్‌ను ఎలా హ్యాండిల్ చేశారు? ’ అనే ప్రశ్న ఎదురుకాగా.. యూనిక్ ఆన్సర్ ఇచ్చింది. స్టిరియోటైప్ అనేది ఒక సార్వత్రిక భావన మాత్రమేనని తెలిపిన అంకిత.. సమాజంలో అసాధరణంగా జరిగే ఏ విషయం గురించైనా మాట్లాడుకునేందుకు ప్రజలు ఇష్టపడతారని తెలిపింది. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదని, ఇలాంటి ధోరణి మానవజాతిలో సహజమని చెప్పింది. మనిషిగా మనలో కనిపించనిభయం, మనుగడ నైపుణ్యాలు ఉంటాయన్న ఆమె.. కొన్ని సార్లు ఆ నైపుణ్యం వల్ల కలిగే చెడు గుర్తించేంత స్పృహ ఉండదని, ఎప్పుడూ తనకు సంతోషాన్ని కలిగించే వాటినే ఎంచుకుంటానని తెలిపింది.