చిన్నారి వైద్యానికి ఆపన్నహస్తం అందించిన.. అనిరుధ్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-12-03 11:37:25.0  )
help
X

దిశ, జడ్చర్ల: నాలుగు రోజుల చిన్నారి గుండె శస్త్ర చికిత్స నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి ఆపన్నహస్తం అందించిన జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జానంపల్లి అనిరుధ్ రెడ్డి. జడ్చర్ల పట్టణానికి చెందిన ఖైజార్, జాహేరా బేగం దంపతుల నాలుగు రోజుల చిన్నారికి గుండెకు సంబంధించిన వాల్స్ బ్లాక్ కావడంతో హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. చిన్నారి వైద్యానికి 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబమైనా ఖైజర్, జాహెరా బేగం దంపతులు ఆపన్న ఆస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మినాజ్, జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జనంపల్లి అనిరుధ్ రెడ్డికి విషయం తెలిపాడు.

వెంటనే స్పందించిన ఆయన చిన్నారి గుండె శస్త్రచికిత్స వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబానికి అందజేయాల్సిందిగా చెక్కును ఇచ్చారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి లక్ష రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. చిన్నారి సమస్య తెలపగానే తక్షణమే స్పందించి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed