వాట్సాప్‌లో చాటింగ్.. ఈటల బావమరిది శవయాత్ర

by Sridhar Babu |   ( Updated:2021-07-29 03:45:04.0  )
వాట్సాప్‌లో చాటింగ్.. ఈటల బావమరిది శవయాత్ర
X

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈటల బావమరిది దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. దళితులను కించపరుస్తూ వాట్సాప్‌లో చాటింగ్ చేశాడని ఆరోపిస్తూ వారు దిష్టి బొమ్మ దగ్ధం చేసినట్టు తెలిపారు. అంతే కాకుండా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈటెల బావమరిది శవయాత్ర నిర్వహించారు. బుడగ జంగాల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోటం రాంకుమార్ అధ్యక్షతన 100 మంది బుడగజంగాలు హజరై అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత బంధు పథకం పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్, అతని బంధువులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మోటం రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నాయకులు శ్యాం, బాబు, శ్రీనివాస్, తదితరులతో పాటు మహిళలు పాల్గొన్నారు.

Read More: ఈటలకు డిపాజిట్ దక్కకుండా చేస్తా.. మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story