ఆండ్రాయిడ్‌లో అంధుల కోసం స్పెషల్ ఫీచర్స్..

by Shyam |   ( Updated:2021-09-24 08:59:25.0  )
android
X

దిశ, ఫీచర్స్ : టెక్ దిగ్గజం గూగుల్ కెమెరా స్విచెస్, ప్రాజెక్ట్ యాక్టివేట్ అనే ఫీచర్లను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. శారీరక వైకల్యాలు ఉన్నవారు ఇప్పుడు ముఖ హావభావాలను ఉపయోగించి తమ ఆండ్రాయిడ్-పవర్డ్ స్మార్ట్‌ఫోన్‌లను హ్యాండ్స్-ఫ్రీగా ఆపరేట్ చేయవచ్చు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లో ఇంటరాక్ట్ అవ్వడానికి స్వైప్‌ లేదా ట్యాప్స్ చేస్తుంటాం. అందుకు బదులుగా ఫేస్ రికగ్నషన్ ద్వారా ‘కెమెరా స్విచెస్’లు ఉపయోగపడతాయి. మీ ఫోన్ కెమెరాను ఉపయోగించి ముఖ సంజ్ఞలను ఇది గుర్తిస్తుంది. వినియోగదారులు కుడివైపు చూడండి, ఎడమవైపు చూడండి, పైకి చూడండి, నవ్వండి, కనుబొమ్మలు ఎత్తండి లేదా నోరు తెరవండి వంటి ఆరు సంజ్ఞల నుంచి ఏదైనా ఎంచుకోవచ్చు.

అంతేకాదు నోటిఫికేషన్‌లు ఓపెన్ చేయండి, హోమ్ స్క్రీన్‌కు తిరిగి వెళ్లడం లేదా పాజ్ చేయడం వంటి పనులను నిర్వహించడానికి ఆయా గుర్తులను కూడా ఉపయోగించుకోవచ్చు. కెమెరా స్విచెస్ అనేది స్విచ్ యాక్సెస్‌‌కు అప్‌డేట్ కాగా ఇది 2015లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ చేతులు లేదా వాయిస్‌ని ఉపయోగించకుండా తమ ఫోన్‌లోని అంశాలను స్కాన్ చేయవచ్చు, ఎంచుకోవచ్చు. కొత్త ఫీచర్‌ని ఫిజికల్ స్విచెస్‌తో పాటు ఉపయోగించవచ్చు. ఫీచర్‌ని ఉపయోగించడానికి, మీ ఫోన్ సెట్టింగ్‌లను తెరిచి, యాక్సెసిబిలిటీని ఎంచుకుని, ఆపై యాక్సెస్ స్విచ్ (ఇంటరాక్షన్ కంట్రోల్స్ కింద) నొక్కండి. దాన్ని ఆన్ చేసి పర్మిషన్ ఇవ్వండి. మీరు ప్లే స్టోర్ నుంచి యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇక ‘ప్రాజెక్ట్ యాక్టివ్’ అనే ఫీచర్ అవే ముఖ సంజ్ఞలను ఉపయోగించడానికి వ్యక్తులను అనుమతిస్తుంది. సంజ్ఞల ఆధారంగా టెక్స్ట్ పంపడం, ఫోన్ చేయడం చేస్తుంది. ఉదాహరణకు ఎవరైనా ప్రాజెక్ట్ యాక్టివేట్ ఉపయోగించి ఒక ప్రశ్నకు అవును లేదా కాదు అని సమాధానం ఇవ్వవచ్చు. ఏదో ఒక స్పీచ్-జనరేటింగ్ పరికరంలో టైప్ చేయడానికి లేదా ఎవరైనా తమ వద్దకు రమ్మని అడగడానికి ఒక టెక్స్ట్ పంపమని అడగవచ్చు. ప్రాజెక్ట్ యాక్టివేట్ యూఎస్, యూకే, కెనడా ఆస్ట్రేలియాలో ఇంగ్లిష్ భాషలో అందుబాటులో ఉంది. మీరు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంయి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed