- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యువగళం కామెడీ షో..పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ : మంత్రి అంబటి రాంబాబు
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. యువగళం ఓ కామెడీ షో అని అభివర్ణించారు. మ్యానిపెస్టోలోని ప్రకటించిన ప్రతీ హామీని అమలు చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బుధవారం మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కరోనా కష్ట కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు అల్లాడిపోతుంటే ఒక్క వైఎస్ జగన్ మాత్రమే వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారు అని చెప్పుకొచ్చారు. విద్య, వైద్యం విషయంలో సీఎం చాలా స్పష్టతతో ఉన్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ మనవడు అన్న ఒకే ఒక్క కారణంతో రాజకీయాల్లో చెలామణి అవుతున్న వ్యక్తి నారా లోకేశ్ అని చెప్పుకొచ్చారు. టీడీపీకి ఒక శనిలా దాపురించిన వ్యక్తి లోకేశ్ అని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
పోలవరం పూర్తి చేసేది జగనే
పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తామో..ఎప్పుడు ప్రారంభిస్తామో తాము స్పష్టం చేయలేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎప్పుడు ఒక ముహూర్తమంటూ తానెప్పుడూ చెప్పలేదని అన్నారు. గత ప్రభుత్వాలు పోలవరం పూర్తి చేశాం అని పదేపదే చెప్పుకొచ్చాయని తీరా ప్రాజెక్టు వద్దకు వెళ్లి చూస్తే అక్కడ మొత్తం అవకతవకలేనని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు ప్రారంభించడం ఖాయం అని చెప్పుకొచ్చారు. ఏదేమైనా మళ్లీ తామే అధికారంలోకి వస్తాం అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ రాజకీయాలపట్ల ఏమాత్రం అవగాహన లేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాష్ట్రం గురించి అవగాహన లేని ప్యాకేజ్ స్టార్ పవన్ కల్యాణ్ నారా లోకేశ్‌కి వత్తాసు పలకడంపై మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో ప్రజలంతా చాలా స్పష్టంగా ఉన్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది వైసీపీయేనని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మళ్ళీ వైఎస్ జగన్‌ని ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ముసుగులో టీడీపీ కోవర్టుగా దగ్గుబాటి పురంధేశ్వరి పనిచేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.