Viveka Murder Case: త్వరలో తేలిపోనున్న నిజాలు

by srinivas |   ( Updated:2023-02-05 13:27:22.0  )
Viveka Murder Case: త్వరలో తేలిపోనున్న నిజాలు
X

దిశ, కడప:వివేకా హత్య కేసులో మరికొన్ని రోజుల్లో నిజాలు తేలనున్నాయని దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవల్‌గా మారిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో నిజాలు బయటపడే రోజు దగ్గర్ పడిందని తెలిపారు. హైదరాబాద్ కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు సమన్లు తీసుసుకునేందుకు ఆయన సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ ఇంతకాలం తాను చెప్పినా అబద్ధం అన్నారని, ఆ నిజాలు ఏమిటో ఇక అందరికీ తెలుస్తాయని పేర్కొన్నారు. ఇటీవల కొందరిని విచారించారంటే సమాచారం ఉంటేనే విచారణకు పిలిచి ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో విచారణకు జగన్ సహకరించి ఉంటే పది రోజుల్లో కేసు పూర్తి అయ్యేదన్నారు. హైదరాబాద్‌కు కేసు బదిలీ చేయడం మంచిదేనని దస్తగిరి పేర్కొన్నారు.

READ MORE

Minister Jayaram: ఫోన్ ట్యాపింగ్ ఎక్కడా లేదు

Advertisement

Next Story