- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండు వెన్నెల్లో .. ధవళ కాంతుల్లో..
దిశ, కడప ప్రతినిధి: ఆకాశమే పందిరి వేయగా.. చుక్కలన్నీ ముత్యాల తలంబ్రాలై సీతారాముల చేతిలో మెరిశాయి. చంద్రబింబమే రామచంద్రుని మోములో ఒదిగి పండు వెన్నెల కురిపించగా .. సీతమ్మ తల్లి ధవళ కాంతుల్లో పున్నమి జాబిలయ్యింది. సీతారాముల కల్యాణ వేళ చూసిన కనులదే భాగ్యమంటూ లక్షల నయనాలు తేజోమయంకాగా.. ఒంటిమిట్ట క్షేత్రం తన వైభవానికి ఉప్పొంగిపోయింది. బుధవారం రాత్రి రాములోరి కల్యాణ ఘట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత శోభాయమానంగా నిర్వహించింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తలంబ్రాలు సమర్పించారు. కల్యాణానంతరం భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు. కల్యాణాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, టీటీడీ జేఈవో వీర బ్రహ్మం , లక్షల మంది భక్తులు కల్యాణాన్ని తిలకించారు.