- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మదనపల్లి టీడీపీ అభ్యర్థిగా షాజహాన్ బాషా..!
దిశ ప్రతినిధి, తిరుపతి: మదనపల్లి అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం మైనార్టీలకు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆరు నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఒక ముఖ్య నేతతో ఈ మేరకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఒక స్థానాన్ని ముస్లిం మైనారిటీలకు లేక బీసీలకు కేటాయించడం సాంప్రదాయంగా వస్తోంది. గత ఎన్నికలలో తంబళ్లపల్లి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ బీసీలకు కేటాయించింది. ఈ పర్యాయం తంబళ్లపల్లె నుండి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో ముస్లిం మైనార్టీలకు మదనపల్లి స్థానాన్ని కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
గత ఎన్నికలలో మదనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున నవాజ్ బాషా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండిన షాజహాన్ బాషా యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కావున తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ అభ్యర్థి షాజహాన్ బాషాను ఈసారి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మదనపల్లి నియోజకవర్గం ఆ పార్టీని ఎక్కువ ఎన్నికలలో ఆదరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీకి పట్టుకోమ్మగా మారింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 9 సార్లు సాధారణ ఎన్నికలు జరగకగా ఐదు సార్లు టిడిపి విజయకేతనం ఎగురవేసింది. ఈ నియోజకవర్గ నుంచి అత్యధికంగా కమ్మ సామాజిక వర్గం నేతలు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నియోజక వర్గంలో కమ్మ తర్వాత రెండుసార్లు రెడ్లు, మరో రెండు సార్లు ముస్లిం నేతలు విజయం సాధించారు.
అలాగే రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ, మరో రెండు పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రానున్న ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గం నుండి తెలుగుదేశం పార్టీ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, బిసి సామాజికవర్గం నుండి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు కూడా టికెట్ బరిలో నిలచారు. వీరితోపాటు 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాటకొండ కృష్ణ సాగర్ రెడ్డి తమ్ముడు బాబు రెడ్డి కూడా టికెట్ ఆశించారు. ఆయన భార్య రాటకొండ శోభ 1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మదనపల్లి నుంచి విజయం సాధించారు. రాజకీయ నేపథ్యమున్న తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే కుల సమీకరణాల దృష్ట్యా మదనపల్లి సీటును ముస్లిం మైనారిటిలకు చంద్రబాబు కేటాయించినట్లు తెలిసింది.
మదనపల్లి నియోజకవర్గం పరిధిలోకి మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలు వస్తాయి. 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాటకొండ నారాయణ రెడ్డి మదనపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1989 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల మోహన్ రెడ్డి విజయం సాధించారు. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాటకొండ కృష్ణ సాగర్ రెడ్డి, 1999 ఎన్నికలలో ఆయన తమ్ముడు బాబు రెడ్డి భార్య రాటకొండ శోభ, 2004 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దొమ్మలపాటి రమేష్ విజయకేతనం ఎగురవేశారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున షాజహాన్ బాషా విజయం సాధించారు. 2014 ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, 2019 ఎన్నికలలో మహమ్మద్ నవాజ్ బాషా ఎన్నికయ్యారు. ముస్లిం మైనారిటీకి చెందిన షాజహాన్ బాషా 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.
రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు కొంత విరామం ఇచ్చి, నాలుగు నెలల కిందట లోకేష్ ఆధ్వర్యంలో యువగళం పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. మదనపల్లెలో రెండుసార్లు మైనార్టీ అభ్యర్థులు విజయం సాధించిన దాఖలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించగలిగే శక్తి మైనారిటీలకు ఉంది. కావున తనకు రాజకీయ అనుభవం కూడా ఉన్న కారణంగా ఈ పర్యాయం మైనారిటీ కింద తనకు టికెట్ కేటాయించాల్సిందిగా మొదట నుండి షాజహాన్ బాషా కోరుతున్నారు. ఆయన విజ్ఞప్తిని పార్టీ పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.
Read More..