- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kadapa: వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు మృతి
దిశ,కడప: కడప, అన్నమయ జిల్లాల్లో జరిగిన రెండు వెర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచాయితీ కొత్తపల్లె క్రాస్ వద్ద చిత్తూరు - కడప జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా బద్వేలుకు చెందిన పెనమాల లక్ష్మమ్మ (65) పక్షవాతంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం చిత్తూరు జిల్లా విరూపాక్షపురానికి కారులో తీసుకెళ్లారు. అదే సమయంలో
కొత్తపల్లి క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు వీరి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో లక్ష్మమ్మతో పాటు కుమారుడు నర్సయ్య (41), కారు డ్రైవర్ రాజారెడ్డి (35) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న వారి బంధువులు చిన్నక్క (60) బాలుడు హర్షవర్థన్ తీవ్రంగా గాయపడ్డారు. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నక్క మృతి చెందారు. రాయచోటి వైపు నుంచి కడపకు వెలుతున్న మరో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గరు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాదంలో ముగ్గురు మృతి
మరోవైపు చెన్నూరు మండలం పాలెంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. చెన్నూరు బెస్త కాలనీకి చెందిన దినేష్ (27), వెంకట సురేష్ (25), వెంకటేష్ అలియాస్ సుబ్బయ్య (21) మోటారు సైకిల్‌పై ఒంటిమిట్ట వెళ్లి చేపలు వ్యాపారం కోసం చెన్నూరుకు బయలుదేరారు. పాలెంపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న చెన్నూరు ఎస్.ఐ శ్రీనివాసులురెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.