Ap News: కడపకు రూ.1,500 కోట్ల నిధులు.. శరవేగంగా అభివృద్ధి పనులు

by srinivas |
Ap News: కడపకు రూ.1,500 కోట్ల నిధులు.. శరవేగంగా అభివృద్ధి పనులు
X

దిశ, కడప: 75 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా రూ.1,500 కోట్లతో కడపలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మేయర్ కె సురేష్ బాబు తెలిపారు. సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కడపపై ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఈ అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం గురువారం మేయర్ కె సురేష్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ప్రణాళికబద్దంగా కడపలో పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ, సర్కిల్స్ సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. నగరంలో 17 రోడ్ల విస్తరణ పనులు చేపట్టామన్నారు. ట్రాఫిక్ రద్దీని తట్టుకునే విధంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రజల సౌకర్యం కోసం ఆదర్శనగరంగా తీర్చిదిద్దేందుకు రోడ్ల విస్తరణ పనులు చేపట్టామన్నారు.


ప్రభుత్వ నాలుగున్నర సంవత్సరాల పాలనలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు రాష్ర్టంలో మరెక్కడ జరగడం లేదన్నారు. పాలకవర్గం, ఉపముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆదర్శ, ఆరోగ్య, సుందర, ఉన్నత నగరంగా కడప నగరాన్ని తీర్చి దిద్దుతున్నామన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో దేవుని కడప చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కడప నగరానికి బ్రహ్మంసాగర్ నుంచి అష్యూర్ వాట్ ఇచ్చేందుకు రూ.450 కోట్లతో శాశ్వత ప్రాతిపదిక పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి కడప నగర పర్యటనలో రూ.250 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ , సైక్రియాట్రిక్ ఆసుపత్రులు ప్రారంభోత్సవం చేస్తారని మేయర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed