- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Stop Suicides: ఆత్మహత్యలకు పాల్పడే వారికి లేడీ జాయింట్ కలెక్టర్ కీలక సూచన

దిశ, కడప: విద్యార్థులు ఆత్మహత్యలు(Student Suicide) పాల్పడకుండా బతికి సాధించాలని, ఉన్నత లక్ష్యాలతో బంగారు భవిష్యత్తును ఎంచుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ (Joint Collector Aditi Singh)అన్నారు. "ఆత్మహత్యలు వద్దు - బతికి సాధిద్దాం" అని కడప( Kadapa) జిల్లా టీఎన్ఎస్ఎఫ్(TNSF) రూపొందించిన పోస్టర్లను గురువారం జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కలెక్టరేట్లోని తమ చాంబర్లో ఆవిష్కరించారు. ప్రస్తుతం విద్యార్థులను చైతన్య పరుస్తూ మంచి అవగాహన కార్యక్రమాన్ని రూపొందించిన టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు అనవసరమైన భయాందోళనలు, అవమానాలు, చదువు ఒత్తిడి వీటితో ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తొందరపాటు నిర్ణయాలతో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. మంచిగా చదువుకొని వివిధ రంగాలలో నిష్ణాతులుగా తయారై ఉజ్వల భవిష్యత్తును పొంది తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి హమీద్, కార్యదర్శి అక్షయ్ కుమార్ రెడ్డి, నాయకులు బిల్లా నవీన్, రఘు, లక్ష్మణ్, ఫక్రుద్దీన్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.