- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడపలో దంచి కొట్టిన వర్షం.. జలమయమైన ఆర్టీసీ బస్టాండ్
X
దిశ,కడప: వైఎస్ఆర్ జిల్లాలో బుధవారం పలు చోట్ల వర్షాలు కురవగా జిల్లా కేంద్రమైన కడప నగరంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు భారీ వర్షం దంచి కొట్టింది. కొద్దిసేపు తెరిపించిన మళ్లీ భారీగా వర్షం కురవడంతో కడప నగరంలోని రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. సాయంత్రం 7:30 వరకు కురుస్తూనే ఉన్న వర్షాల కారణంగా నగరంలోని డ్రైనేజీలో పొంగిపొర్లాయి. కడప పట్టణంలోని కోటిరెడ్డి సర్కిల్ -ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు జిల్లా కోర్టు నుంచి బస్టాండ్ వరకు జలమయం అయింది. ఆర్టీసీ బస్టాండ్‌లో పెద్ద ఎత్తున నీళ్లు నిలిచాయి. మృత్యుంజయ కుంట ప్రాంతంలో , అప్సరా రోడ్డు, కేశవరెడ్డి స్కూల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Advertisement
Next Story