గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

by Jakkula Mamatha |   ( Updated:2024-02-22 13:00:52.0  )
గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
X

దిశ, కడప: గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా లో ఈనెల 25న పరీక్ష రాసే అభ్యర్థులు సౌలభ్యం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని గురువారం జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

పరీక్షా కేంద్రాల సమాచార సౌలభ్యం కోసం కంట్రోల్ రూమ్ 08562-246344 ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ కంట్రోల్ రూమ్ కాల్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పేర్కొన్న ఫోన్ నెంబర్ కాల్ చేస్తే కంట్రోల్ రూమ్ స్టాఫ్ సహకరిస్తారన్నారు.

గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఏపీపీఎస్సీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పరీక్షను పక్కాగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష హాల్లో ఎటువంటి కాపీయింగ్ జరిగే అవకాశాలు ఉండవని, ఎలాంటి డిజిటల్ వస్తువులను అనుమతించే అవకాశం లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story