- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: 18 అకౌంట్ల నుంచి డబ్బు మాయం.. సైబర్ నేరస్థుడు అరెస్టు
దిశ, కడప: పార్ట్ టైం ఆన్ లైన్ ఉద్యోగం పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన రజత్ సక్సేనాను అరెస్ట్ చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అంబురాజన్ తెలిపారు. కడప డీపీవోలో ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ ఉద్యోగం పేరుతో వాట్సాప్ ద్వారా వచ్చిన లింకును కడప జిల్లాకు చెందిన నిరుద్యోగి ఓపెన్ చేశారని చెప్పారు. దీంతో ఆయనకు మాయమాటలు చెప్పి రూ.10.26 లక్షలు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారని తెలిపారు. చైనా నుంచి వచ్చిన మెసేజ్‌ను ఫార్వర్డ్ చేయడం ద్వారా రజత్ సక్సేనా కమిషన్ కోసం మోసానికి పాల్పడ్డాడని చెప్పారు. ఇలా నిందితుడు 18 అకౌంట్లు ఓపెన్ చేసినట్టు గుర్తించామని స్పష్టం చేశారు.
జైపూర్ నుంచి సైబర్ క్రైమ్స్
అయితే ఈ స్కాంను రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ టీం ద్వారా సైబర్ నేరగాళ్ల సమాచారాన్ని ట్రాక్ చేసి నిందితుడిని పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితుడు బీటెక్ వరకు చదువుకున్నాడని... కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేశాడని ఎస్పీ పేర్కొన్నారు. ఆ తర్వాత అధిక డబ్బు సంపాదన కోసం సైబర్ క్రైమ్ బృందం సభ్యులు ఇచ్చే కమిషన్ కోసం వారితో కలిసి మోసాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, రెండు సెల్‌ఫోన్లు, 14 బ్యాంకు కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అంబురాజన్ తెలిపారు.