- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
1998 DSC: కడప డీసీసీ అధ్యక్షుడికి ఉపాధ్యాయ ఉద్యోగం
దిశ, కడప: కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావుకు 1998 డిఎస్సీలో కడపలో జరిగిన కౌన్సిలింగ్ నందు ఉపాధ్యాయ ఉద్యోగం వరించింది. సిద్ధవటం దిగవపేటలో ఆయనను టీచరుగా నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవరెడ్డి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా నీలి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రెండున్నర ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లా అధ్యక్షుడిగా సేవలందించానని, 25 ఏళ్ల నాటి టీచర్ పోస్టు కలగా ఉండేదన్నారు. ఆ కల నెరవేరిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలో తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాన్నారు. ఆరోగ్యం సహకరిస్తే రిటైర్మెంట్ తర్వాత తిరిగి తన రెండో ఇన్నింగ్స్ రాజకీయంగా ప్రారంభిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.