Vijayawada: ఏపీ రాజధానిపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-11-18 12:55:25.0  )
Vijayawada: ఏపీ రాజధానిపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి అమరావతే రాజధాని అని, ఇందుకు తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ రాజధానిలో మౌళిక సదుపాయాల కోసం కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలిపారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. విజయవాడలో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలకు కేంద్రం రూ.500 కోట్లు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. హోంమంత్రి వేధింపులతో ఓ ఎస్సీ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే.. అతనికి సామాజికంగా ఏం చేశారో చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story