- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: వారంతా జైలుకే.. బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, కడప: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అవినీతి, అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వైసీపీ నేతలు జైలుకెళ్లాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. కడప వైయస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాలుగు సంవత్సరాల పాలన అంతా అవినీతిమయంగా కొనసాగిందని విమర్శించారు. జగన్ ఫ్యాన్ రాష్ట్రంలో రివర్స్‌లో తిరుగుతుందని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు అప్పులు తెచ్చుకొని, ఆ అప్పుల వడ్డీలకు తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి జగన్ తీసుకువచ్చారని భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల పాలనలో ప్రజా సంక్షేమానికి పాటు భాను ప్రకాష్ రెడ్డి పడ్డారన్నారు. రాబోవు ఎన్నికల్లో బిజెపి జనసేనతో కలిసి పోటీ చేస్తుందన్నారు. 9 సంవత్సరాల బీజేపీ పాలనలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం మోడీ చేశారన్నారు. చైనా, జపాన్ తరహాలో భారతదేశాన్ని మోడీ అభివృద్ధి చేశారని చెప్పారు. రైతు సంక్షేమానికి బిజెపి పెద్దపీట వేసింది అన్నారు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కేంద్రంలోనే కాక రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో బిజెపి కిషన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశి భూషణ్ రెడ్డి, బాలకృష్ణ యాదవ్, జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, రామకృష్ణారెడ్డి, పవన్ కుమార్, రవికుమార్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.