గల్ఫ్ బాధితుల కోసం హెల్ప్ డెస్క్.. ఎస్పీ హర్ష వర్ధన్ రాజు

by Javid Pasha |
గల్ఫ్ బాధితుల కోసం హెల్ప్ డెస్క్.. ఎస్పీ హర్ష వర్ధన్ రాజు
X

దిశ, కడప: గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే ఆదుకునేందుకు అన్నమయ్య జిల్లా పోలీసు కార్యాలయంలో ఇమ్మిగ్రేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు తెలిపారు. మంగళవారం రాయచోటిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. జీవనోపాధి దృష్ట్యా గల్ఫ్ దేశాలకు వెళ్ళదలుచుకున్న జిల్లా వాసుల సంరక్షణ, ఫిర్యాదుల కొరకు జిల్లా పోలీస్ కార్యలయం లో ఇమ్మిగ్రేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. గల్ఫ్ దేశాలల్లో ఉంటూ ఇబ్బందులకు గురవుతున్న వారి సంరక్షణ, సహాయం కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 8688830014 ను ప్రారంభించామన్నారు.

అన్నమయ్య జిల్లాలో ఏటా కొన్ని వేల మంది ఉద్యోగం, ఉపాది కొరకు గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారన్నారు. వెళ్ళిన తరువాత అక్కడ బాధలు భరించలేక, ఒక పని కొరకు వీసాతో వెళ్తే ఇంకొక పని చేయించడం, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులకు గురి కావడం లాంటి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇలాంటి బాధితులకు సంబంధించి ఇక్కడ వారి బందువులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఏజెంట్లపై ఫిర్యాదు చేస్తుంటారన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసుల కృషి తో ఆ వ్యక్తుల ను స్వదేశానికి తిరిగి తీసుకొస్తున్నామన్నారు. ఇప్పటివరకు చాలా సంఘటనలు గల్ఫ్ వీసా విషయంలో జిల్లా వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

వీటిని దృష్టిలో పెట్టుకొని 10 రోజుల క్రితం ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యలపైన వివరాలు సేకరించామన్నారు. ఈ సమస్యల పరిష్కారం కొరకు మరియు ఉపాధి నిమితం గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికి అవగాహన కలించాలనే ఉద్దేశ్యంతో ఈ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా గల్ఫ్ దేశాలకు వేల్లాలనుకొనే వారు హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి వారి వివరాలను తెలిపితే వారి వివరాలను నమోదు చేసుకొని వీరి ఏజెంటు యొక్క పూర్తి వివరాలను సేకరించి తదుపరి చర్యలు తీసుకొంటామన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు. విదేశాలకు వెళ్ళే ముందు ఈ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి పోలీస్ వారి సలహాలు సూచనలు పొందాలని ఎస్పీ కోరారు.

Advertisement

Next Story

Most Viewed