- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: పండగ మీకు.. పస్తులు మాకా?
దిశ, కడప: పద్నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవా ముఖ్యమంత్రి జగనన్నా అంటూ అంగన్‌వాడీ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కడప అంగన్వాడీ రూరల్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ‘పండగ మీకు, పస్తులు మాకా’ అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని ఏసుక్రీస్తు పటానికి ప్రార్ధనలు చేశారు .
కడప జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మీదేవి, డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి డిఎం ఓబులేసు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. 14 రోజులుగా చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ స్పందిస్తుందని ఆశగా ఎదురుచూసిన అంగన్వాడి అక్కచెల్లెళ్లకు క్రిస్మస్ పండగలో కూడా నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా ప్రమోట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు.