- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీకి మరో షాక్.. బీజేపీలో చేరిన అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైలా
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అనంతపురం అధ్యక్షుడు పైలా నరసింహయ్య బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి నరసింహయ్యను పురంధేశ్వరి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధి కోసం నేతలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
కాగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు గెలుపొందారు. టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు బీజేపీ వెళ్లింది. దీంతో కూటమి నేతలుకు ప్రజలు ఘన విజయాన్ని అందించారు. ఈ మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అటు కేంద్రంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయి. రాష్ట్రానికి అన్ని విధాలుగా కేంద్రం సహకరిస్తుండటంతో ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖత చూపుతున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది.