YS Vijayamma: ఈ నీచ సంస్కృతిని సహించను.. వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-11-04 12:16:57.0  )
YS Vijayamma: ఈ నీచ సంస్కృతిని సహించను.. వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తనను తీవ్రంగా కలచి వేస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి(YS Jagan Mother) వైఎస్ విజయమ్మ(YS Vijayamma) అన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం పట్ల ప్రకటన విడుదల చేసిన ఆమె అసత్య ప్రచారాలని ఖండించారు. ఈ ప్రకటనలో ఆమె.. కొంతమంది సోషల్ మీడియా(Social Media)లో లేనిపోని అసత్య కథనాలు(Fake News) ప్రచారం చేయడం చూస్తుంటే తనకు తీవ్ర మానసిక వేదన కలుగుతోందని అన్నారు. తనను అడ్డం పెట్టుకుని చేస్తున్న నీచ, నికృష్ణ రాజకీయాలకు ఖండించకపోతే ప్రజలు నిజం అని నమ్మే ప్రమాదం ఉందని చెప్పారు. వాస్తవాలను, కొంత మంది దుర్మార్గపు ఉద్దేశాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే నేను ఈ వివరణ రాస్తున్నానని ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజుల కిందట నా కారుకు ప్రమాదం(Car Accident) జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారని, గతంలో ఎప్పుడో జరిగిన నా కారు ప్రమాదాన్ని.. నా కుమారుడిపై పెట్టి దుష్ప్రచారం చెయ్యడం అత్యంత జుగుప్సాకరమని మండిపడ్డారు.

అంతేగాక రాజకీయంగా లబ్ది పొందాలనే ఈ ప్రయత్నం అత్యంత దర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న నా మనవడి దగ్గరకు వెళితే దాన్ని కూడా తప్పుగా చిత్రికరించి.. భయపడి నేను విదేశాలకు వెళ్ళిపోయినట్లు దుష్ప్రచారం చెయ్యడం అత్యంత నీతిమాలిన చర్య అని, రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. ఇలా దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే విధానం ఏమాత్రం సమర్ధనీయం కాదని, ఈ నీచ సంస్కృతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చిచెప్పారు. ఇకముందు ఇటువంటి దుష్ప్రచారాలను, వ్యక్తిత్వహనన వైఖరిని ఆపితే మంచిదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు(AP People) కూడా ఈ వికృత చేష్టలను గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. ఇక సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెబుతారని, ఇక పై ఇటువంటి లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తే నేను చూస్తూ ఊరుకోదలచుకోలేదని విజయమ్మ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed