YS Sharmila:ప్రియాంక గాంధీ గెలుపు పై స్పందించిన వైఎస్ షర్మిల

by Jakkula Mamatha |   ( Updated:2024-11-23 12:28:35.0  )
YS Sharmila:ప్రియాంక గాంధీ గెలుపు పై స్పందించిన వైఎస్ షర్మిల
X

దిశ,వెబ్‌డెస్క్: వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో గెలుపొందిన ప్రియాంక గాంధీకి(Priyanka Gandhi) ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) శుభాకాంక్షలు తెలిపారు. కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గెలుపొందారు. ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో అందరి దృష్టి వయనాడ్ పార్లమెంటరీ స్థానం ఫలితాలపైనే ఉంది. ఈ క్రమంలో నేడు(శనివారం) వెలువడిన వయానడ్ ఫలితాల్లో ఆమె విజయం సాధించడం పై వివిధ రాష్ట్రాల మంత్రులు, నేతలు, రాజకీయ నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల ప్రియాంక గాంధీ గెలుపు పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. అద్భుత విజయం సాధించారంటూ ప్రియాంక గాంధీకి వైఎస్ షర్మిల అభినందనలు తెలిపారు. భారత రాజ్యాంగ విలువలకు మద్దతుగా ప్రజల గొంతును లోక్ సభలో బలంగా వినిపిస్తారని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed