BJP: ఆ ఫ్లైఓవర్‌కు పటేల్ పేరు పెట్టాలి.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్

by Ramesh Goud |   ( Updated:2025-01-05 17:04:01.0  )
BJP: ఆ ఫ్లైఓవర్‌కు పటేల్ పేరు పెట్టాలి.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఆరంఘర్ ఫ్లైఓవర్(Aranghar flyover) కు సర్ధార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) పేరు పెట్టాలని, ఫ్లైఓవర్ పై ఏర్పాటు చేసిన ఎంఐఎం బ్యానర్ల(MIM banners)ను వెంటనే తొలగించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Raja Singh) డిమాండ్ చేశారు. ఆరంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంపై స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారని, ఈ ఫ్లైఓవర్ పై మొత్తం ఎంఐఎం జెండాలు, బ్యానర్లు పెట్టి, ఫ్లైఓవర్ పనులు ప్రభుత్వం నుంచి కాకుండా.. ఎంఐఎం పార్టీ నుంచి ఫండ్ కలెక్ట్ చేసి పూర్తి చేసినట్లుగా క్రియేట్ చేశారని ఆరోపించారు.

ఇది తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచి ఈ ఫ్లైఓవర్ కట్టారని, బ్యానర్లు పెట్టుకోవడానికి ఎంఐఎం వాళ్లకు ఎవరు అధికారం ఇచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఇది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎంఐఎం వాళ్లు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ జెండా మోసి, ఇప్పుడు వాళ్లనే తిడుతున్నారని, ఎవరు అధికారంలో ఉంటే వారి కాళ్లు పట్టుకోవడం వీరికి అలవాటేనని ఎద్దేవా చేశారు. ఈ ఫ్లైఓవర్ కి ఓవైసీ పేరు పెట్టాలని అంటున్నారని, ఓవైసీ ఎమన్నా ఫ్రీడం ఫైటరా..? లేక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎంతో మంతి త్యాగాలు చేస్తున్న సమయంలో ఎంఐఎం పార్టీ వాళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సపోర్ట్ చేశారని తెలిపారు. అలాగే ఫ్లైఓవర్ ప్రాంతంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ ఉందని, అందుకే ఆ ఫ్లైఓవర్ కు సర్ధార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఆ ఫ్లైఓవర్ పై ఉన్నా ఎంఐఎం బ్యానర్లను వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed