- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Punjab & Sindh Bank: ఎంఎస్ఎంఈలకు తక్షణ రుణాలివ్వనున్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా క్రెడిట్ సౌకర్యాలను పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల నుంచి ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 25 లక్షల వరకు తక్షణ రుణ పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. బ్యాంక్ ఇప్పటికే డిజిటల్ హోమ్ లోన్, వెహికల్ లోన్ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 15 నిమిషాల్లోనే సూత్రప్రాయ ఆమోదం ఇస్తోంది. దీన్ని ఎంఎస్ఎంఈ రంగానికి కూడా విస్తరించనుంది. రిటైల్ విభాగంలో విజయవంతంగా తక్షణ రుణ సదుపాయాన్ని అందిస్తున్నాం. దీని తర్వాత మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్(ఎంఎస్ఎంఈ)లకు రూ. 25 లక్షల వరకు రుణ పరిమితితో అందించాలని భావిస్తున్నాం. ఈ ఆటోమేటెడ్ లోన్ విధానం ద్వారా ప్రాసెసింగ్, మంజూరు దశలో మాన్యువల్ జోక్యాన్ని తొలగిస్తుంది. వేగంగా, సమర్థవంతంగా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మెహ్రా చెప్పారు. ఈ ప్రక్రియ అమలుకు అవసరమైన చర్యలు దాదాపు సిద్ధమయ్యాయి. ఈ నెలాఖరు నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని రవి మెహ్రా పేర్కొన్నారు. అంతేకాకుండా వచ్చే నెల నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) అందించడం, రెన్యూవల్ ప్రక్రియను ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రెడిట్ కార్డు కింద ఒక రైతుకు పూచీకత్తు లేకుండా రూ. 2 లక్షల వరకు రుణాలివ్వనున్నట్టు ఆయన వెల్లడించారు.