జగన్.. అసలు వైఎస్ఆర్ వారసుడే కాదు: షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-04-08 15:59:13.0  )
జగన్.. అసలు వైఎస్ఆర్ వారసుడే కాదు: షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం, సోదరుడు జగన్‌పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల సోమవారం కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ అసలు వైఎస్ఆర్ వారసుడే కాదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జగన్‌ది హత్యా రాజకీయాల పాలన అని విమర్శించారు. సొంత బాబాయిని చంపినోళ్లను జగన్ కాపాడుతున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా తేల్చిందని.. ఈ కేసులో అన్నీ ఆధారాలు ఉన్నాయని సీబీఐ చెప్పిందని గుర్తు చేశారు. సీబీఐ అన్ని ఆధారాలు చూపించినా అవినాష్‌ను జగన్ కాపాడుతున్నాడని ఫైర్ అయ్యారు. జగన్ ఐదేళ్ల పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నేరవేర్చలేదని నిప్పులు చెరిగారు. జగన్ నాలుగున్నరేళ్లు నిద్రపోయి.. సరిగ్గా ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు డీఎస్సీ వేశారని ఎద్దేవా చేశారు.

Read More..

జగన్‌ రెడ్డి‌వి మొత్తం హత్యా రాజకీయాలే.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story