- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ నియంతను తెచ్చా.. ఇక్కడ నియంతలను దింపేందుకు వచ్చా.. వైఎస్ షర్మిల
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జోష్ పెంచారు. ప్రజల్లో పార్టీని బలోపితం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తాజాగా ఓ భహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఈ ప్రపంచంలో అందరి కంటే తనంటేనే ఇష్టమని.. అలాంటి తన తండ్రికి కాంగ్రెస్ పార్టీలో ఎంతో గౌరవం ఉందని నిర్ధారించుకున్న తరువాత తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.
ఇక తన పైన ఐరెన్ లెగ్ రోజా పిచ్చి కామెంట్స్ చేశారని.. తెలంగాణ కోడలిగా తెలంగాణ ప్రజలను ఉద్ధరించడం కోసం పార్టీని పెట్టి.. ఆ పార్టీని వదిలేసానని రోజా అంటుందని.. అసలు నన్ను విమర్శించే అర్హత రాజాకు ఉందా అని ప్రశ్నించారు. తాను తన పార్టీని వదిలెయ్యలేదని.. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశానని.. కాగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు తెలంగాణ వైఎస్ ఆర్ కాగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు. ఇక తాను తెలంగాణ కోసం శ్రమించి అక్కడ ఓ నియంతను తీసుకొచ్చానని పేర్కొన్నారు.
ఇక తన పుట్టిల్లు అయినటువంటి ఆంధ్ర రాష్ట్రం బాగు కోసం.. ఇక్కడి నియంతలను దించడం కోసం తాను వచ్చినట్లు వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరిగే వరకు, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవరకు, రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నెరవేరే వరకు తాను ఆంధ్రప్రదేశ్ లోనే ఉండటానని పేర్కొన్నారు.
Read More..