Breaking: ఎన్నికల నేపథ్యంలో పార్టీల జోరు.. అది లేక షర్మిల బేజారు..

by Indraja |   ( Updated:2024-02-02 05:46:49.0  )
Breaking: ఎన్నికల నేపథ్యంలో పార్టీల జోరు.. అది లేక షర్మిల బేజారు..
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు అధికార ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తూ విపక్షాలపై అధికార అస్త్రాలను ప్రయోగిస్తోంది. కొన్ని అస్త్రాలను డైరెక్ట్ స సంధిస్తే మరికొన్నింటిని వెనక నుండి వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది.

ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతు ఇవ్వడనికి అవకాశం ఉందా..? లేదా..? అనేది కూడా స్పష్టంగా తెలీదు. ఇక జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జోరు పెంచింది. జిల్లాల వారీగా పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం లోకి తీసుకు వచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది.

అయితే హైవే పైన హై స్పీడ్ లో వెళ్తున్న వారికి ఊహించని విద్ధంగా స్పీడ్ బ్రేకర్ అడ్డుగా వచ్చినట్లు పార్టీ ప్రచారాల్లో జడ్ స్పీడ్ తో వెళ్తున్న షర్మిలకు సెక్యూరిటీని తగ్గించడంతో ఆమె జోరుకు బ్రేక్ పడినట్లు అయ్యింది. మొదట్లో షర్మిలకు 4+4 సెక్యూరిటీ ఉండేది. కాగా ఆ సెక్యూరిటీని 2+2 కి కుదించింది పోలీస్ డిపార్ట్మెంట్.

అయితే తాజాగా ఆ 2+ 2 సెక్యూరిటీని 1+1 కి తగ్గించింది. దీనితో తనకు 4+4 సెక్యూరిటీని ఇవ్వాల్సిందిగా షర్మిల పోలీస్ డిపార్ట్మెంట్ ను కోరుతూ లెటర్ రాసారు. ఇక ఈ విషయం పైన స్పందించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రెసిడెంట్ డా. ఎన్ రఘువీరా రెడ్డి X వేదికగా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ఏపీసీసీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గతంలో 4+4 సెక్యూరిటీని కలిగి ఉండేవారని.. అయితే ఆమె ప్రజాక్షేత్రంలో చురుకుగా ఉన్న తరుణంలో సెక్యూరిటీని 2+ 2కి తగ్గించారని.. ఇప్పుడు మళ్ళీ 1 +1కి తగ్గించడం జరిగిందని.. ఇక కార్యకర్తల సమావేశాల నిమిత్తం తాము రాష్ట్రవ్యాప్తంగా తిరిగినప్పుడు ఎన్నికల తరుణంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం తాను గమనించినట్లు.. కనుక తక్షణం షర్మిల కోరినట్లు 4+4 సెక్యూరిటీని, ఎస్కార్ట్ వాహనాన్ని కల్పించగలరు అంటూ రాసుకొచ్చారు.

Advertisement

Next Story