- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Putin To Visit India: త్వరలోనే భారత్ లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్(Kremlin) అధికారికంగా ప్రకటించింది. ఎప్పుడు పర్యటిస్తారని విషయంపై ఇరు దేశాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)తో పుతిన్ భేటీ కానున్నారు. అక్టోబరు నెల చివర్లో బ్రిక్స్ సదస్సు కోసం రష్యాలో మోడీ పర్యటించారు. కజాన్‌లో పుతిన్ తో మోడీ భేటీ అయ్యారు. భారత్‌లో పర్యటించాల్సిందిగా పుతిన్‌ను మోడీ ఆహ్వానించారు.
మాస్కోలో పర్యటించిన మోడీ
రష్యా-ఉక్రెయిన్ సమస్యపై(Russia-Ukraine issue) గతంలోనే మోడీ, పుతిన మధ్య చర్చ జరిగింది. "ఇరు దేశాలతో భారత్ టచ్ లో ఉంది. ఈ వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలనేది మా వైఖరి. వివాదాలకు తావులేకుండా శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలని విశ్వశిస్తున్నాం. శాంతిని నెలకొల్పేందుకు సాయం చేయడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.' అని ప్రధాని మోడీ అన్నారు. మరోవైపు, శాంతి ప్రణాళికతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ మాస్కోలో పర్యటించారు. అందులో భాగంగానే పుతిన్ తో భేటీ అయ్యారు.