- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ram Mandir Anniversary: అయోధ్య రామ్ మందిర్ తొలి వార్షికోత్సవం.. ఎక్స్‌లో ప్రధాని మోడీ సందేశం

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో రామ్‌లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది అయింది. ఈ సందర్భంగా రామ్ మందిర్‌లో విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవాలు (Ram Mandir Anniversary:) ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 13 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఏడాది పూర్తైన సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు విషెస్ తెలియజేశారు.‘అయోధ్యలో శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం సందర్భంగా పౌరులందరికీ శుభాకాంక్షలు. శతాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం ద్వారా నిర్మించబడిన ఈ ఆలయం మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వం. ఈ దివ్యమైన, అద్భుతమైన రామాలయం వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో ప్రధాన ప్రేరణగా పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా విషెస్ చెప్పారు. వందల ఏళ్ల హిందువుల కల సాకారమైన గొప్ప క్షణం, భారతీయుల అస్తిత్వానికి రూపమిచ్చిన మహోన్నత ఘట్టం, యావత్ హిందూ సమాజం ఎదురుచూసిన ఆత్మగౌరవ ఉత్సవం, అయోధ్యలో వెలసిన దివ్య భవ్య రామ మందిరం. మహాద్భుత మందిరం ఆవిష్కృతమై ఏడాది పూర్తైన శుభ సందర్భంగా హిందూ బంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.